: ఏపీఎన్జీవోల అమలాపురం సభ వాయిదా


తుపాను కారణంగా ఏపీఎన్జీవోలు అమలాపురంలో నిర్వహించ తలపెట్టిన సభను వాయిదా వేస్తున్నట్టు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. విభజన ప్రక్రియ ఇంకా అనేక దశలు దాటాల్సి ఉందన్న ఆయన, శాసనసభలో విభజన బిల్లుకు వ్యతిరేకంగా 13 జిల్లాల నేతలు అభిప్రాయాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అప్రజాస్వామికమని జాతీయ పార్టీలన్నీ చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగా నిబంధనలకు వ్యతిరేకంగా బిల్లును పార్లమెంటులో పెడితే జాతీయ పార్టీలు వ్యతిరేకిస్తాయన్నారు. సభ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్నది త్వరలోనే వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News