: సచిన్ విషయంలో హర్ట్ అయిన కాంబ్లి
సచిన్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లి హర్ట్ అయ్యాడు. వాంఖడే స్టేడియంలో సచిన్ ప్రసంగించినప్పుడు తన పేరును ఉచ్చరించకపోవడంతో కాంబ్లి బాధపడ్డాడు. కనీసం శారదాశ్రం విద్యామందిర్ తరఫున తాము నెలకొల్పిన 664 పరుగుల భాగస్వామ్యం గురించైనా మాట్లాడలేదని వాపోయాడు. ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ కాంబ్లి ఈ విధంగా స్పందించాడు. అలాగే, ఈ నెల 18న ముంబైలోని ఒక హోటల్ ఇచ్చిన ఫేర్ వెల్ పార్టీకి కూడా తనను పిలవలేదని బాధపడ్డాడు. తాను, సచిన్ పదేళ్ల వయసు నుంచి కలిసి పెరిగామని, ప్రతి విషయాన్ని పంచుకున్నామని, ఒకర్నుంచి మరొకరం నేర్చుకున్నామని... గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నాడు. సచిన్ ప్రసంగిస్తున్నప్పుడు, అతను చెబుతున్న అన్ని విషయాలు తన కళ్ల ముందు మెదిలాయని... సచిన్ కంటతడి పెట్టుకున్నప్పుడు, తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయానని చెప్పాడు.