: చిన్నారి సైకిల్ చక్రంలో కేజీన్నర బంగారం


కస్టమ్స్ అధికారుల తనిఖీలు పెరిగిపోవడంతో స్మగ్లర్లు చిత్ర, విచిత్ర మార్గాలలో దొంగ బంగారాన్ని దేశానికి తీసుకొస్తున్నారు. ఇలాగే కోజికోడ్ కు చెందిన జకారియా... షార్జా నుంచి కోయంబత్తూరు కు ఎయిర్ అరేబియా విమానంలో వచ్చాడు. అతడిని కస్టమ్స్ అధికారులు అణువణువూ తనిఖీ చేశారు. ఏమీ దొరకలేదు. జకారియా వెంట ఒక చిన్నారుల సైకిల్ కూడా ఉంది. దానిని పరిశీలించగా.. చక్రంలోపల దాచిన 1.6కేజీల బంగారం బయటపడింది. దీని విలువ 47 లక్షలుగా కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. బంగారంతోపాటు జకారియాను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజే కేజీన్నర బంగారంతో షార్జా నుంచే వచ్చిన మరొక ప్రయాణికుడూ కోయంబత్తూరు విమానాశ్రయంలో పట్టుబడడాన్ని చూస్తుంటే స్మగ్లర్లు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో తెలుస్తోంది.

  • Loading...

More Telugu News