: విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది: పళ్లం రాజు


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము ఎంతగా కోరుతున్నా అధిష్ఠానం తమ మాట పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి పళ్లంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారో తమకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ప్రాంతాల వారీగా విడిపోయినా, ప్రజల మధ్య విభేదాలు రాకూడదని ఆయన ఆకాంక్షించారు. సీమాంధ్రకు కేంద్రం ఏ విధంగా న్యాయం చేస్తుందో తాము చెప్పలేమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News