: పని చేయకపోతే అధికారులకు జరిమానా
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సక్రమంగా సేవలందించకపోతే జరిమానా విధించే చట్టం వచ్చింది. విధులను నిర్వర్తించని పక్షంలో అధికారులు రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 50 వేల రూపాయల వరకు జరిమానాకు గురయ్యే బిల్లుకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ఈ చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కాల్ సెంటర్, వినియోగదారుల సహాయక కేంద్రం ఏర్పాటు చేయాలి. అలాగే కేంద్రంతోపాటు రాష్ట్రాలలో ప్రజాసమస్యల పరిష్కార కమిషన్లను ఏర్పాటు చేయాలి. పౌరులు కోరిన సేవలు తగిన సమయంలో అందేలా ఈ చట్టం ప్రతి ఒక్క ప్రభుత్వాధికారిపైనా బాధ్యత మోపుతుంది.
రాష్ట్ర కమిషన్‌లో న్యాయం జరగలేదని భావిస్తే లోకాయుక్తకు, కేంద్ర కమిషన్‌లో న్యాయం జరగలేదనుకుంటే లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఎన్నారైలు కూడా ఈ బిల్లు పరిధిలో సేవలను పొందే అంశాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తాయి.