: నేనే సీఎం అయితే విభజన వాదుల్ని జైల్లో తోసేవాడిని: టీజీ


తనకు సీఎం పదవే వస్తే రాష్ట్ర విభజన కోరుకునే వారందర్నీ జైల్లో తోసేవాడినని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, లక్షలాది మందితో ఢిల్లీని ముట్టడిస్తే విభజన ఆగుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీఎన్జీవోల నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా భారీ సంఖ్యలో ఢిల్లీ వెళ్లాలని కోరారు. అసెంబ్లీకి బిల్లు వస్తే తిరస్కరించాలని తాము భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే అసెంబ్లీని రద్దు చేసే అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నట్టు టీజీ తెలిపారు.

  • Loading...

More Telugu News