: అక్రమ నిధుల సేకరణ ఆరోపణలపై విచారణ కోసం 'ఆప్' కమిటీ


సమాజం నుంచి అవినీతిని ఏరేస్తామంటూ పుట్టుకొచ్చిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై ఇప్పుడు అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా మీడియా సర్కార్ అనే వెబ్ సైట్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల అవినీతిని స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టింది. దీనిపై విచారణ కోసం ఆప్ ఒక కమిటీని నియమించింది. అలాగే వెబ్ సైట్ పై కూడా చట్టపరమైన చర్యలను పరిశీలించనుంది.

ఆప్ తరఫున ఆర్కే పురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న షాజియా ఇల్మితోపాటు, కుమార్ విశ్వాస్ తదితర ఆప్ నేతలను మీడియా సర్కార్ వెబ్ సైట్ ప్రతినిధులు సాయం కోసం సంప్రదించారు. భూ లావాదేవీలు, పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిపెట్టాలని కోరారు. ఇందుకు ప్రతిఫలంగా పార్టీకి విరాళాలు ఇస్తామని చెప్పగా.. వారు ఒప్పుకున్నారు. అయితే, ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆప్ అధినేత కేజ్రీవాల్.. అవినీతిని ఉపేక్షించేది లేదని ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఈ ఆరోపణలు బయటకు రావడంతో తమ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందేమోనని ఆప్ నేతల్లో భయం పట్టుకుంది.

  • Loading...

More Telugu News