: ఇంజినీరింగ్ కళాశాలకు ఆకతాయిల బాంబు బెదిరింపు
బాంబు పెట్టామంటూ వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ నానాటికీ ఎక్కువవుతున్నాయి. దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటన అనంతరం క్షణం తీరికలేకుండా ఉన్న హైదరాబాదు పోలీసుల సహనాన్ని కొన్నిఆకతాయి మూకలు పరీక్షిస్తున్నాయి. ఇదే క్రమంలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ దగ్గర్లో ఉన్న సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్ వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ బృందాలు పోలీసులతో కలిసి తనిఖీలు చేశాయి. చివరికి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎఫ్పుడూ బెదిరింపు కాల్స్ రావడం, హుటాహుటిన అక్కడికి వెళ్లి తనిఖీలు చేయడమే తప్ప పోలీసులు కూడా ఆకతాయిల వివరాలు స్పష్టంగా కనుగొనకపోవడం గమనార్హం.