: హెలెన్ తుపానును ఫొటో తీసిన 'మంగళయాన్'


అంగారకుడిపైకి పంపించిన మంగళయాన్ మార్గమధ్యంలోనే తన పనిని ప్రారంభించింది. మరి కొద్ది గంటల్లో కోస్తా తీరాన్ని తాకనున్న హెలెన్ తుపానును ఫొటో తీసి గ్రౌండ్ స్టేషన్ కు పంపించింది. ఇది మంగళయాన్ పంపిన మొట్టమొదటి చిత్రం. నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం ఈ ఫొటోను తీసింది. భారత్ కు 68,000 కిలోమీటర్లు ఎత్తు నుంచి మంగళయాన్ ఈ ఫొటోను క్యాప్చర్ చేసింది. మంగళయాన్ కు అమర్చిన కెమెరాను పరీక్షించే నిమిత్తం శాస్త్రవేత్తలు ఈ ఫొటోను తీసేలా సంకేతాలు పంపారు. ఫొటోలో ఇండియా, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, గల్ఫ్ ప్రాంతాలు కూడా కవర్ అయ్యాయి. పిక్చర్ చాలా అద్భుతమైన క్వాలిటీతో వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Loading...

More Telugu News