: బట్టలూడదీసి కొడతా : ఎమ్మెల్యే రత్నం
"నన్నే ప్రశ్నిస్తారా? కాంగ్రెస్ నాయకుల్లారా ఖబడ్దార్.. బట్టలూడదీసి కొడతా కొడకల్లారా" అని టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం నిప్పులు చెరిగారు. మెదక్ జిల్లా శంకరపల్లిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చిలికిచిలికి గాలివానగా మారింది. తెలంగాణ వ్యతిరేకి అయిన సీఎం కిరణ్ ఫ్లెక్సీని ఎలా ఏర్పాటు చేస్తారంటూ కాంగ్రెస్ నేతలను టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ప్రశ్నించారు. దీంతో, రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు ఫోటోను శంకరపల్లి గ్రామ పంచాయతీ భవనంలో ఎలా ఉంచుతున్నారని వారు ఎదురు ప్రశ్నించారు. అంతే, ఎమ్మెల్యేలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పరుష పదజాలంతో ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో రచ్చబండ రచ్చరచ్చైంది.