: పడవను రక్షించుకోబోయి గల్లంతైన మత్స్యకారుడు


హెలెన్ తుపాను ప్రతాపం చూపుతోంది. గౌతమి గోదావరి ఒడ్డున శివంబాత్ వద్ద మల్లాడి వీరబాబు(23) అనే మత్స్యకారుడు ఈ రోజు గల్లంతయ్యాడు. తుపాను కారణంగా గోదావరిలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో, వీరబాబుకి చెందిన పడవ తాడు తెగి కొట్టుకుపోయింది. దీంతో, తన పడవను రక్షించుకునేందుకు ప్రయత్నించిన వీరబాబు కూడా గల్లంతయ్యాడు. ఈ ఘటనతో, అతని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. వీరిని యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణా రావు, పరిపాలనాధికారి గణేషన్ పరామర్శించారు. తుపాను తాకిడికి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే, అధికారుల బృందం పర్యటిస్తోంది. రోడ్లపై విరిగిపడ్డ చెట్లను ప్రజా పనుల శాఖాధికారులు తొలగిస్తున్నారు.

  • Loading...

More Telugu News