: మరో భారతీయుడికి ఒబామా పట్టం
భారతీయ అమెరికన్ గార్గీ ఘోష్ ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన గ్లోబల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సభ్యురాలిగా నియమించారు. గార్గీ ఇప్పటి వరకు బిల్ అండ్ మిలిందాగేట్స్ ఫౌండేషన్ లో పాలసీ అనాలసిస్ అండ్ ఫైనాన్సింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. కాలిఫోర్నియా వర్సిటీ గ్లోబల్ హెల్త్ గ్రూపులోనూ గార్గీ సభ్యురాలిగా ఉన్నారు.