: డిసెంబర్ 10న లోక్ సభ ముందుకు తెలంగాణ బిల్లు?


అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ బిల్లు త్వరలో లోక్ సభ ముందుకు రానుంది. డిసెంబర్ ఐదు నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో 10వ తేదీన తెలంగాణ బిల్లును దిగువ సభ లోక్ సభ ముందుకు తీసుకొస్తారని తెలుస్తోంది. తొలిరోజు ఎప్పటిలాగే పలువురు ప్రముఖుల మృతికి సభ్యులు సంతాపం వ్యక్తం చేస్తారు. అలా ఆరోజు సభ వాయిదా పడుతుంది. ఇక రెండవరోజు అంటే ఆరవ తేదీన.. బాబ్రీ మసీదు వార్షికోత్సవం, వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలపై చర్చ ఉంటుందట. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షం బీజేపీ బొగ్గు స్కాం గురించి ప్రభుత్వాన్ని నిలదీయటం, ఈ క్రమంలో సభ వాయిదా పడటం జరుగుతుంది. దాంతో, తొమ్మిదవ తేదీవరకు పలు విషయాలపై తీవ్ర చర్చలు ఉంటాయి.

ఇక 10 నుంచి 13 తేదీల మధ్యలో లోక్ సభలో 'తెలంగాణ బిల్లు'ను యూపీఏ సర్కారు పెట్టవచ్చని వినికిడి. బిల్లుపై చర్చకు కేవలం నాలుగు లేదా మూడు గంటలే సమయం ఇవ్వొచ్చని, ఈ సమయంలో సభలో సీమాంధ్ర సభ్యులకు బిల్లుపై మాట్లాడే అవకాశాన్ని ఇవ్వరని తెలుస్తుంది. బి.జె.పి కి తప్పక మిగతా రాజకీయ పార్టీలకు తలో ఐదు నిమిషాలు మాత్రమే సమయం కేటాయిస్తారట. అలా తక్కువ సమయంలో చర్చను ముగించేసి చకచకా బిల్లును ఆమోదింపజేసుకోవటం, 2014 జనవరి 1 కల్లా రెండు రాష్ట్రాలను ఏర్పాటుచేయటమే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ధ్యేయంగా పెట్టుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News