: సుప్రీం న్యాయమూర్తిగా పీసీ ఘోష్
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన పినాక చంద్ర ఘోష్ నేడు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా కురియన్ జోసెఫ్ కూడా సుప్రీం న్యాయమూర్తిగా నేడు ప్రమాణం చేశారు.
వీరిద్దరితో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఘోష్ స్థానంలో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఈశ్వరయ్య బాధ్యతలు చేపడతారు.