: షారూఖ్ ఇంటి బాత్రూమ్ లో మంటలు
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ముంబైలోని బాంద్రాలో షారూఖ్ ఇంట్లోని బాత్రూమ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి మంటలు లేచాయి. అలారమ్ మోగడంతో సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. వారు షారూఖ్ ఇంటికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో షారూక్ ఇంట్లో లేరు.