: దూసుకొస్తున్న 'హెలెన్'


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి 120 కి.మీ, ఒంగోలుకు 250 కి.మీ, విశాఖపట్నానికి 200 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ మధ్యాహ్నం మచిలీపట్నం సమీపంలో హెలెన్ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ, తెలంగాణల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో 100 నుంచి 120 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి.

  • Loading...

More Telugu News