: ప్రైవేటు బస్సులపై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 60 బస్సులను సీజ్ చేశారు. హైదరాబాద్ లో 46, మెదక్ లో 7, విజయవాడలో 3, గుంటూరు లో 4 బస్సులను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.