: అది ప్రపంచంలోనే అతి పెద్దదట!


ప్రపంచానికి తరగని శక్తినిచ్చే సూర్యుడి శక్తిని ఒడిసి పట్టుకోవడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఇతరత్రా శక్తులను సేకరించినా అవి కొన్నాళ్లకు తరిగిపోతాయి. అలాకాకుండా మనందరికీ తరాలపాటు తరగని శక్తినిచ్చే సూర్యుడి నుండి వేడిని ఒడిసి పట్టుకోవడంలో చైనా ఒక అడుగు ముందుకు వేసింది. అతిపెద్ద సౌరవిద్యుత్తు కేంద్రాన్ని ఆ దేశం ఏర్పాటు చేసుకుంటోంది.

టిబెట్‌లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్తు కేంద్రాన్ని (ఫోటో ఓల్టాయిక్‌ పవర్‌ స్టేషన్‌) నిర్మించనుంది. భారత సరిహద్దు రేఖకు సమీపంలో టిబెట్‌లోని ఎన్‌గరీ ప్రిఫెక్చర్‌లో ఈ విద్యుత్తు కేంద్ర నిర్మాణాన్ని చైనా పూర్తిచేసినట్టు ఆదేశ జాతీయ వార్తాసంస్థ జిన్హువా వెల్లడించింది. ఈ 10-ఎంవీ పీవీ స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం, గ్వాడియన్‌ లాంగ్వాన్‌ టిబెట్‌ న్యూ ఎనర్జీ కంపెనీ సంయుక్తంగా నిర్మించాయని తెలిపింది. మొత్తం 23.8 హెక్టార్లలో ఏర్పాటు చేసిన పది మెగావాట్ల సామర్ధ్యంగల ఈ ప్లాంటును ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నడపనున్నారు. ఈ ప్లాంటు 25 ఏళ్లపాటు పనిచేస్తుందని ఈ వార్తాసంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News