: ఆధార్ లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్


ఆధార్ కార్డులు జారీ చేయడంలో దేశంలో మనరాష్ట్రమే ప్రథమస్థానంలో నిలిచింది. ఈమేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటివరకు 5.36 కోట్ల ఆధార్ కార్డులను పౌరులకు అందించిందని ఆయన తెలిపారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 28.78 కోట్ల ఆధార్ కార్డులను జారీ చేశామని శుక్లా వివరించారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ కేవలం 999 ఆధార్ కార్డులు మాత్రమే జారీ చేసినట్టు మంత్రి తెలిపారు. 

  • Loading...

More Telugu News