: సిలిండర్ కోసం ఆధార్ ఉండాలని ఒత్తిడి తేవొద్దు: హైకోర్టు


గ్యాస్ సిలిండర్ కావాలంటే ఆధార్ కార్డు ఉండాలని వినియోగదారులపై ఒత్తిడి తేవొద్దని రాష్ట్ర హైకోర్టు గ్యాస్ పంపిణీ సంస్థలను ఆదేశించింది. గ్యాస్ సరఫరాకు, ఆధార్ కార్డుకు ముడిపెట్టవద్దని చెప్పింది. ఈ విషయంపై కొన్ని రోజుల కిందట టీఎస్ఆర్ శర్మ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. దానిని పరిశీలించిన న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. దీంతో ఇకపై వినియోగదారులకు ఆధార్ లేకపోయినా రాయితీ సిలిండర్ పొందే అవకాశం కలిగింది.

  • Loading...

More Telugu News