: సచిన్ చివరి టెస్టు రికార్డు సృష్టించింది
ప్రపంచ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ సాధించని రికార్డు లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి సచిన్ ఆడిన చివరి మ్యాచ్ మరో రికార్డు సృష్టించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మాస్టర్ బ్లాస్టర్ ఆడిన ఫేర్ వెల్ మ్యాచ్ ను ప్రపంచ దేశాల్లోని 1739 టీవీ చానెల్స్ చూపించాయని స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. గత ఎనిమిదేళ్లలో టీవీల ద్వారా అత్యధిక ప్రజలు వీక్షించిన మ్యాచ్ గా ఇది రికార్డు పుటలకెక్కింది. మాస్టర్ తన రిటైర్ మెంట్ ను ముందే ప్రకటించడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దానికి తోడు ప్రపంచ వార్తా పత్రికలన్నీ సచిన్ రిటైర్మెంట్ సందర్భంగా పూర్తి కథనాలను ప్రసారం చేశాయి. దీంతో ప్రపంచ దేశాల్లోని క్రీడాభిమానులంతా క్రికెట్ దిగ్గజం సచిన్ మ్యాచ్ ను వీక్షించేందుకు ఆసక్తి చూపించారు.