: శబరిమలకు 128 ప్రత్యేక రైళ్లు
అయ్యప్పస్వాముల శబరిమల యాత్ర కోసం దక్షిణ మధ్య రైల్వే 128 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబరు 6 నుంచి 18 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక రైళ్ల కోసం ఈ నెల 25 నుంచి రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని ద.మ.రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు.