: నిర్మాత వడ్డే రమేష్ కన్నుమూత


ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్(65) కన్ను మూశారు. కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హీరో వడ్డే నవీన్ ఆయన కుమారుడే. 'పాండవ వనవాసం' చిత్రాన్ని హిందీలో నిర్మించడం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన రమేష్ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తో బొబ్బిలిపులి, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య, చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు, శ్రీ ఏడుకొండల స్వామి, పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ, విశ్వనాథ నాయకుడు, నేనేరాజు నేనేమంత్రి, రావణబ్రహ్మ, లవ్ స్టోరీ 1999 వంటి పలు హిట్ చిత్రాలను రమేష్ నిర్మించారు. దాంతో పాటు పండంటి కాపురం చిత్రాన్ని 'సుర్ సంగ్' పేరుతో హిందీలో రీమేక్ చేసి విజయం సాధించారు. రాజశేఖర్ నటించిన 'అమ్మకొడుకు' చిత్రానికి రమేష్ దర్శకత్వం కూడా వహించారు.

  • Loading...

More Telugu News