: శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: డీఎస్
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ చెప్పారు. కొత్త రాష్ట్రం ఏర్పడే సమయంలో రెచ్చగొట్టే విషయాలను తెలంగాణ ప్రజలు పట్టించుకోరాదని సూచించారు. ఇరు ప్రాంత ప్రజలు పూర్తి అవగాహనతో మెలగాలని అన్నారు. విభజన ప్రక్రియతో అన్ని రంగాల్లో పంపకాలు జరుగుతాయని తెలిపారు.