: రాష్ట్ర విభజన వద్దని ముందు నుంచి చెబుతున్నాం: అశోక్ బాబు


ఆంధ్రప్రదేశ్ ను విభజించవద్దని తాము ముందు నుంచి చెబుతున్నామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ 11 అంశాలపై స్పష్టత లేకుండానే విభజనపై కేంద్రం ఎందుకు వేగంగా ముందుకు వెళ్తుందో తెలియడం లేదన్నారు. బిల్లు తిరస్కరించేందుకు అన్ని జాతీయ పార్టీలను కలుస్తామని అన్నారు. రాష్ట్ర సమైక్యతపై సీమాంధ్ర ఎమ్మెల్యేల అభిప్రాయాలను కోరతామన్నారు.

డిసెంబర్ తొలి వారంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలుస్తామని అన్నారు. ఈ నెల 24న ఉద్యోగసంఘాలు సమావేశం కానున్నాయని, ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగాలా? వద్దా? అనే విషయాన్ని ఆరోజు నిర్ణయిస్తామని తెలిపారు. రానున్న 20 రోజులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అత్యంత కీలకమైనవని అన్నారు. ఆర్టికల్ 371 డి విషయంలో కేంద్రం సందిగ్ధ స్థితిలో ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News