: గవర్నర్ కు ఉపముఖ్యమంత్రి లేఖ


రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ లేఖ రాశారు. శాసనసభను ప్రోరోగ్ చేయవద్దని లేఖలో కోరారు. తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి ఏ క్షణమైనా అసెంబ్లీ అభిప్రాయం కోరవచ్చని తెలిపారు. అసెంబ్లీ అభిప్రాయానికి అడ్డంకులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. ఆర్టికల్ 174(1)ప్రకారం డిసెంబర్ 20 లోపు అసెంబ్లీ, కౌన్సిల్ కు బిల్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీని, కౌన్సిల్ ను సమావేశపర్చాలని దామోదర లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News