: 211 పరుగులకే విండీస్ ఆల్ అవుట్
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ధాటికి కేవలం 211 పరుగులకే ఆలౌటైంది. టెస్టు సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారని, టెస్టు జట్టు కంటే వన్డే జట్టు పటిష్ఠంగా ఉందన్న పలు అంచనాల మధ్య బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. విండీస్ ఆటగాళ్లలో ఒకే ఒక ఆటగాడు అర్ధ సెంచరీ సాధించడం విశేషం. కాగా చార్ల్స్(42), శామ్యూల్స్(24), డారెన్ బ్రావో(59), సిమ్మన్స్(29), డ్వేన్ బ్రావో(24) కాస్త మెరుగ్గా ఆడారు. భారత జట్టు పార్ట్ టైమ్ బౌలర్లతోనే ఆటను నడిపించడం విశేషం. భారత జట్టులో ఏడుగురు బౌలర్లు బౌలింగ్ చేయడం విశేషం. కాగా సురేష్ రైనా, జడేజాలు తలో మూడు వికెట్లు తీసి రాణించారు. దీంతో 48.5 ఓవర్లలో 211 పరుగులకు విండీస్ ఆలౌట్ అయింది.