: రచ్చబండ రచ్చరచ్చ
చిత్తూరు జిల్లా తిరుపతి నగరపాలక సంస్థలో జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. రచ్చబండ సందర్భంగా ప్రసంగిస్తున్న ఎంపీ చింతామోహన్ ను వైఎస్సార్సీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కల్పించుకుని ఎంపీని అక్కడి నుంచి తరలించారు.