: అర్ధ సెంచరీ చేసిన డారెన్ బ్రావో


కోచిలో జరుగుతున్న మొదటి వన్డేలో విండీస్ బ్యాట్స్ మెన్ డారెన్ బ్రావో హాఫ్ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. ఎంతో ఒత్తిడిలో ఆడిన బ్రావో.. ఈ క్రమంలో తన 13వ అర్ధ శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ప్రస్తుతం బ్రావో 75 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 58 పరుగుల వద్ద ఆడుతున్నాడు. అతని సోదరుడు డ్వేన్ బ్రావో 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం విండీస్ జట్టు 36 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News