: మన తొలి రాకెట్ ప్రయోగానికి 50 ఏళ్లు


మన దేశం మొట్టమొదటి రాకెట్ ప్రయోగం చేసి, అంతరిక్ష రంగంలో విజయబావుటా ఎగురవేసి నేటికి సరిగ్గా యాభై ఏళ్లు పూర్తయ్యాయి. 1963 నవంబర్ 21వ తేదీన కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉన్న తుంబా అనే చిన్న తీరప్రాంత గ్రామం నుంచి మొదటి రాకెట్ ను అంతరిక్షంలోకి పంపారు. అక్కడ మొదలైన మన ప్రస్థానం అంగారక యాత్ర చేపట్టేంతవరకు వచ్చింది. మన తొలి రాకెట్ ను అమెరికాలో తయారుచేశారు. తుంబానే తర్వాత రోజుల్లో తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్ గా... ఆ తర్వాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్ గా రూపాంతరం చెందింది. అనంతరం శ్రీహరికోటను అనువైన ప్రాంతంగా గుర్తించి... షార్ కేంద్రాన్ని నిర్మించారు.

  • Loading...

More Telugu News