: రాజ్యాంగ నిబంధనల ప్రకారమే విభజన జరగాలి: బొత్స


రాష్ట్ర విభజన రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరగాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు బొత్స హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారని తెలిపారు. రాజ్యాంగం పరిధిలో పనిచేసే స్పీకర్, గవర్నర్ పదవులకు పవిత్రత ఉందని... ఆ పదవులపై రాజకీయం చేయడం తగదని సూచించారు. విభజనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల నివాసాల ఎదుట ఏపీఎన్జీవోలు ధర్నా చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News