: వచ్చేస్తున్నాయి... స్వీట్ కండోమ్స్!
కండోమ్.. అవాంఛిత గర్భాలను నిరోధిస్తుంది. సుఖ వ్యాధులకు అడ్డేస్తుంది. ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. చివరికి కుటుంబ నియంత్రణలోనూ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా.. కండోమ్ వాడే వారు చాలా తక్కువే. దీనికి ఎక్కువ మంది ముక్త కంఠంతో చెప్పేది ఒక్కటే. కండోమ్ వాడితే లైంగిక చర్యలో సంతృప్తి ఉండదని.
మరి కండోమ్ వాడినా ఆ తృప్తి నిండుగా ఉంటే.. వినియోగం పెరుగుతుంది.. సమాజానికి ప్రయోజనం సిద్ధిస్తుంది. అందుకే మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు అతి పలుచగా, బలంగా, మరింత సంతృప్తినిచ్చే కండోమ్ ను తయారుచేసేందుకు నడుం బిగించారు. గ్రాఫీన్ ను ఉపయోగించి వీటిని తయారు చేయాలనేది వారి ప్రయత్నం. కార్బన్ కు ఒక రూపమే గ్రాఫీన్. ఈ కండోమ్స్ తయారు చేసే ప్రాజెక్టు కోసం మాంచెస్టర్ పరిశోధకులకు మిలిందాగేట్స్ ఫౌండేషన్ లక్ష డాలర్లను బహుమానంగా అందిస్తోంది. ఈ పరిశోధక బృందానికి డాక్టర్ అరవింద్ విజయరాఘవ ఆధ్వర్యం వహిస్తున్నారు.