: ఆ రెస్టారెంట్లో సెల్ ఫోన్ స్విచాఫ్ చేస్తే 50% డిస్కౌంట్


ఇది మీరెప్పుడూ విని ఉండరు. రెస్టారెంట్ కు వెళ్లి కడుపునిండా నచ్చిన వంటకాలను కుమ్మేసి బిల్లులో సగం చెల్లిస్తే చాలంటే.. ఆ ఆఫర్ నిజంగా అదుర్సే. జెరూసలేం సమీపంలోని ఒక గ్రామంలో ఉన్న అభుఘోష్ అనే రెస్టారెంట్ యజమాని జాదత్ ఇబ్రహీం(49) ఈ తగ్గింపు ఆఫర్ ఇస్తున్నారు. 'రండి... నచ్చిన వంటకాలను రుచి చూడండి. అది కూడా మీ సెల్ ఫోన్ ను స్విచాఫ్ చేసి మరీ తినాలి. అప్పుడు బిల్లులో 50 శాతం డిస్కౌంట్' అని అంటున్నాడు ఇబ్రహీం.

ఈ ఆఫర్ ఎందుకయ్యా? అంటే ఇబ్రహీం ఏం చెబుతారంటే.. 'స్మార్ట్ ఫోన్లు వచ్చాక అనుభవిస్తూ తినడం మానేశారు. అసలు రెస్టారెంట్ కు ఎందుకు వెళతాం చెప్పండి...? నచ్చిన వారితో తోడుగా వెళ్లి నచ్చిన విషయాలు మాట్లాడుకుంటూ నచ్చిన వంటకాలను తినడానికే కదా. కానీ ఇప్పుడు అందరూ చేస్తున్నదేమిటి..? రావడం... కూర్చుని ఆర్డర్ ఇవ్వడం.. చేతిలో మొబైల్ తో చాటింగ్, సర్ఫింగ్, కాల్స్ మాట్లాడడం. దీనిలో మార్పు రావాలి. అందుకే సెల్ ఫోన్ స్విచాఫ్ చేస్తే మా రెస్టారెంట్లో తగ్గింపు ఆఫర్ అందిస్తున్నాను. ఇది చిన్నదే కావచ్చు. కానీ కొంచెం కొంచెంగానే తినే సంస్కృతిని మార్చుతా' అంటున్నారు. ఇబ్రహీం ఆలోచన అభినందనీయం కదూ!

  • Loading...

More Telugu News