: సినీ ఫక్కీలో మెడికల్ షాపు యజమాని కిడ్నాప్


క్వాలిస్ వాహనంలో వచ్చారు.. టాస్క్ ఫోర్స్ పోలీసులమన్నారు.. షట్టర్ మూసి పది నిమిషాలు మాట్లాడారు.. కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అంతా సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన వివరాలు.. హైదరాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ లో నందిముస్లాయిగూడకు చెందిన నర్సింహారెడ్డి మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో షాపు వద్దకు క్వాలిస్ లో నలుగురు వ్యక్తులు టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి లోపలికి ప్రవేశించారు.

షట్టర్ మూసి వేసి పది నిమిషాలు మాట్లాడారు. అనంతరం నర్సింహారెడ్డిని వారు వచ్చిన వాహనంలో తీసుకెళ్లారు. నర్సింహారెడ్డి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News