: మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతి భవిష్యత్ నిర్మాణంలో స్త్రీల పాత్ర ప్రముఖమైనదని ఆయన అన్నారు. మహిళల కోసం, వారి భద్రత కోసం అంకితమయ్యేందుకు ఇంతకుమించిన సందర్భం ఏముంటుందని ప్రణబ్ చెప్పారు. సమాజంలో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించాలని రాష్ట్రపతి మహిళాదినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు.