: ఇక ఐఆర్ సీటీసీ ఖాతాలోనూ డబ్బులు వేసుకోవచ్చు


ఐఆర్ సీటీసీ సైట్ ద్వారా రైల్వే టికెట్లను బుక్ చేసుకోవడానికి నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. దీనివల్ల లావాదేవీలో తీవ్ర జాప్యం, ఒక్కోసారి మధ్యలోనే లావాదేవీ ఆగిపోవడం ఎప్పుడో ఒకప్పుడు అనుభవమై ఉంటుంది. ఈ నేపథ్యంలో మన ఖాతాలో డబ్బులు ఉంచుకునే సదుపాయాన్ని ఐఆర్ సీటీసీ అమల్లోకి తెచ్చింది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులతో లావాదేవీ సమయంలోనే డబ్బు చెల్లించే బదులు ముందుగానే ఐఆర్ సీటీసీ ఖాతాకు జమ చేసుకుని వేగంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News