: మహిళా కస్టమర్ ను చితకబాదిన షాపు యజమాన్యం


భాష తెలియని ప్రాంతాల్లో మనగలగడం చాలా కష్టం. భాష రాని ఓ యువతి షాపుకు సరుకులు కొనుక్కునేందుకు వెళ్లి చావుదెబ్బలు తింది. ఖమ్మం జిల్లా మణుగూరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ సోదరి, ఢిల్లీకి చెందిన సంజు అనే యువతి నీలగిరి సూపర్ మార్కెట్ కి వెళ్లింది, సూపర్ మార్కెట్ కదా అని సరుకులు వేసుకునేందుకు బాయ్ ని బాస్కెట్ అడిగింది. భాష రాని అతనికి ఏమీ అర్థం కాలేదు. అయినప్పటికీ అతని సైగల ద్వారా బాస్కెట్ లేదని అర్ధం చేసుకున్న సంజు సరుకులను చున్నీలో వేసుకుంది.

అంతే, బాయ్ ఒక్కసారిగా 'దొంగ దొంగ' అని అరవడం ప్రారంభించాడు. దీంతో గాభరాపడ్డ యువతి ఏం జరిగిందో అని పరుగెత్తింది. దీంతో ఆమెను దొంగ అని నిశ్చయించుకున్న షాపు యాజమాన్యం చితక బాదింది. ఆమె ఎన్ని రకాలుగా చెప్పినా షాపు యాజమాన్యం వినిపించుకోలేదు. ఇంతలో రోడ్డున పోతున్న హిందీ తెలిసిన మనిషి విషయం చెప్పి ఆమె సోదరుడ్ని పిలిపించడంతో నాలుక కరుచుకుని విడిచిపెట్టారు. షాపు యాజమాన్యంపై బాధితురాలు మణుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News