: అవినీతి నగరాలలో బెంగళూరు, చెన్నై టాప్


అవినీతితో బెంగళూరు, చెన్నై నగరాలు కంపు కొడుతున్నాయి. ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చిన వారు స్వచ్ఛందంగా వాటి గురించి వెల్లడించేందుకు www.ipaidabribe.com అనే సైట్ ను బెంగళూరు కు చెందిన జనాగ్రహ అనే సంస్థ 2011లో ప్రారంభించింది. అప్పటి నుంచి చూస్తే బెంగళూరు వాసులు 16 కోట్ల రూపాయల ఆమ్యామ్యాలను అధికారులకు ఇచ్చుకున్నారు. చెన్నై వాసులు 1,183 మంది కలిసి 7.08కోట్ల రూపాయలు ముట్టజెప్పామని సైట్లో వెల్లడించారు. ఎక్కువ శాతం మంది భూమి పత్రాలు, విద్యుత్, నీటి కనెక్షన్లు, పాస్ పోర్టు వెరిఫికేషన్, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ముడుపులు ఇచ్చుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 22,378 మంది లంచాలు ఇచ్చినట్లు ఈ సైట్లో ఇప్పటి వరకూ అంగీకరించారు. వీరు చెల్లించిన మొత్తం రూ. 57.61కోట్లు. బెంగళూరు, చెన్నై తర్వాత ముంబై(రూ. 6.97కోట్లు), ఢిల్లీ(రూ. 4.4కోట్లు), హైదరాబాద్ (రూ. 2.89కోట్లు) ఉన్నాయి.

  • Loading...

More Telugu News