: కుప్పకూలిన ఆస్ట్రేలియా... 179/6


ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ లో ప్రారంభమైన యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. తొలిరోజు ఆటలో 65 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ జట్టు 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఇదే ఆసీస్ తరపున అత్యధిక స్కోరు. ప్రస్తుతం హ్యాడిన్ 40 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. బ్రాడ్ 49 పరుగులిచ్చి 4 వికెట్లను బలిగొన్నాడు.

  • Loading...

More Telugu News