: గూగుల్ నుంచి ప్రీపెయిడ్ డెబిట్ కార్డు


ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ అన్నింటికీ అనువైన ఒక ప్రీపెయిడ్ డెబిట్ కార్డును విడుదల చేసింది. దీని ద్వారా కోరుకున్న చోట షాపింగ్, ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునే వీలుంది. ప్రస్తుతానికి ఈ కార్డు అమెరికన్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ కార్డు ఉచితమేనని, ఎలాంటి నెలవారీ, వార్షిక చార్జీలు ఉండవని గూగుల్ ప్రకటించింది. బ్యాంకు ఖాతా ద్వారా ఈ కార్డులో డబ్బులను నింపుకోవచ్చని లేదా వినియోగదారులు తమ వ్యాలెట్ ఖాతాల నుంచి కూడా నింపుకోవచ్చని గూగుల్ పేర్కొంది. ఆన్ లైన్ కొనుగోళ్లు పెరుగిపోతున్న నేపథ్యంలో గూగుల్ సరైన సమయంలో సరైన నిర్ణయమన్నట్లు ఈ కార్డును తీసుకువచ్చింది.

  • Loading...

More Telugu News