: అమెరికా డ్రోన్ దాడుల్లో పాక్ లో 8 మంది హతం


తెహ్రీకే తాలిబాన్ చీఫ్ హకీముల్లా హత్య( ఈ నెల 1న) తర్వాత అమెరికా డ్రోన్ లు మరోమారు పాక్ గడ్డపై గర్జించాయి. హంగు జిల్లా తాల్ ప్రాంతంలో ఈ ఉదయం 5 గంటల సమయంలో అమెరికా డ్రోన్ లు మూడు మిసైళ్లను విడిచిపెట్టాయి. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. డ్రోన్ దాడులను నిలిపివేయాలని పాక్ ఎప్పటి నుంచో కోరుతోంది. కానీ, అమెరికా మాత్రం తన పని తాను చేసుకుపోతూనే ఉంది. తాజా ఘటనతో మళ్లీ అమెరికా, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగతాయని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News