: 35 అడుగుల మేర ముందుకొచ్చిన సముద్రం
హెలెన్ తుపాను ప్రభావంతో నెల్లురు జిల్లా సముద్ర తీర ప్రాంతంలో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని తుమ్మలపెంట వద్ద సముద్రం 35 అడుగుల మేర ముందుకు చొచ్చుకు వచ్చింది. దీంతో, స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.