: ఏప్రిల్లో ఒబామా ఆసియాలో పర్యటన


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చే ఏడాది ఏప్రిల్లో ఆసియాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటించే దేశాల జాబితాలో భారత్ ఉండకపోచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ఒబామా గతనెలలోనే ఆసియా దేశాలలో పర్యటించాల్సి ఉంది. కానీ, ఆర్థిక బిల్లుకు సభామోదం లభించక అమెరికాలో షట్ డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. దీంతో ఒబామా పర్యటన రద్దయింది. ఈ పర్యటన వచ్చే ఏడాది ఏప్రిల్లో ఉంటుందని అమెరికా భద్రతా సలహాదారు సుసాన్ రైస్ తెలిపారు. కానీ, ఆసియాలో ఒబామా ఏ దేశాలలో పర్యటిస్తారన్న వివరాలను రైస్ వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News