: హస్తినకు బయలుదేరి వెళ్లిన సీఎం, బొత్స


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్ధుల ఖరారుపై వీరు అధిష్ఠానంతో ప్రధానంగా చర్చిస్తారు.

అనంతరం అభ్యర్ధుల జాబితాను పార్టీ పెద్దలకు నివేదించి ఆమోద ముద్ర వేయించుకోనున్నారు. కాగా, ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీ ఆశావహులు ఢిల్లీలోనే మకాంవేసి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఇంకా పలువురు సీఎం వెంట ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News