: బాపూజీ పేరును తప్పుగా పలికిన మోడీ
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ... ఈ పేరు దాదాపుగా చదువుకున్న ప్రతీ ఒక్కరికీ చిరస్మరణీయం. ఎందుకంటే బాపూజీ పాఠం స్కూల్లోనే అందరినీ పలకరిస్తుంది. దేశ స్వాతంత్ర్య ఫలాన్ని సాధించి పెట్టిన ఆ మహాత్మాగాంధీ జీవితాన్ని క్లుప్తంగా తెలియజేస్తుంది. కానీ, ఎంతో రాజకీయ అనుభవం ఉండి, ప్రత్యర్థి పార్టీల నేతలపై పదునైన వాగ్బాణాలను వదిలే బీజేపీ నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మహాత్ముడి పేరును తప్పుగా పలికారు. రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మోహన్ లాల్ కరంచంద్ గాంధీ అని అన్నారు. దీనిపై చాలా మంది విమర్శలు ఎక్కుపెట్టారు. పాపం మోడీ నోట లాల్ కృష్ణ అద్వానీ పేరు బాగా నానినట్లు ఉంది.