: ఏటీఎంలో మహిళపై దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్


బెంగళూరు నగరంలోని ఓ ఏటీఎం కేంద్రంలో మహిళను కత్తితో నరికి బలవంతంగా దోచుకుపోయిన కేసులో అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ఈ ఉదయం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం 7గంటల సమయంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎంకు వెళ్లగా.. ఆమె వెనుకే వచ్చిన ఒక వ్యక్తి షట్టర్ మూసేసి దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తీవ్రంగా రక్తం కోల్పోవడంతో ఆమె శరీరంలో కుడివైపు భాగం చచ్చుబడినట్లు వైద్యులు ప్రకటించారు.

అయితే, దాడి చేసిన నిందితుడు జ్యోతి వద్దనున్న సెల్ ఫోన్ ను కూడా తీసుకొని వెళ్లాడు. బెంగళూరు పోలీసులు సెల్ ఫోన్ ఈఎంఐ నంబర్ ఆధారంగా అన్వేషణ మొదలుపెట్టారు. అది ఫలించింది. మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా హిందూపూర్ కు చెందిన వ్యక్తి జ్యోతి సెల్ ఫోన్ ను కొని అందులో సిమ్ వేసుకున్నట్లు తెలిసింది. దీంతో బెంగళూరు పోలీసులు జ్యోతి సెల్ ఫోన్ ను కొన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News