: మనిషి ఆధునికమే అయినా వైరస్‌ ప్రాచీనమైంది


ఇప్పటి మనిషి ఆధునిక యుగంకి చెందినవాడే అయినా అతనిలో కనిపిస్తున్న వైరస్‌ మాత్రం ఐదు లక్షల సంవత్సరాలనుండి నిరంతరాయంగా తరాల పాటు మారుతూ వస్తోందట. ఈ విషయాన్ని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. ఐదు లక్షల సంవత్సరాల క్రితం నియాండర్‌తల్‌ మానవ జాతిని పీడించిన వైరస్‌లు నేటి ఆధునిక ప్రజల్లో కూడా కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఆక్స్‌ఫర్డ్‌, ప్లేమౌత్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇటీవల నియాండర్‌తల్‌, డెనిసోవాన్స్‌ అనే జాతులకు చెందిన పూర్వీకుల అవశేషాలతోబాటు ఆధునిక మానవుల డిఎన్‌ఏలను కూడా తులనాత్మకంగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వంశపారంపర్యంగా వచ్చే డిఎన్‌ఎలో ఎనిమిదిశాతం ఎన్డొజీనస్‌ రిట్రోవైరస్‌లు ఉంటాయి. ఇలా పూర్వీకుల నుండి వచ్చిన హెచ్‌ఎంఎల్‌2 కోవకు చెందిన ఎండోజీనరస్‌ రిట్రోవైరస్‌ (ఈఆర్వీ)లకు, ప్రస్తుతం మానవజాతిని బాధిస్తున్న క్యాన్సర్‌ కారక, హెచ్‌ఐవీ కారక వైరస్‌లకు మధ్య సంబంధాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

వంశపారంపర్యంగా వచ్చే ఈఆర్వీలు ఇతర వైరస్‌లతో కలిసినప్పుడు క్యాన్సర్‌ వంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుందని, అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇవి విజృంభించి బయటపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కారణంగానే హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ రోగులకు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయాలపై మరింత లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News