: ఆర్థిక నేరాల మాఫీకే జగన్ పర్యటనలు : దేవినేని ఉమ
జగన్ కోల్ కతా పర్యటన కేవలం 16 బ్రీఫ్ కేస్ కంపెనీల కేసును మాఫీ చేసుకోవడానికేనని తెదేపా నేత దేవినేని ఉమ విమర్శించారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన 16 సూట్ కేసు కంపెనీలు కోల్ కతా, హౌరా నగరాల చిరునామాతోనే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమైక్య ముసుగులో జగన్ ఆర్థిక నేరాల మాఫీకి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయినా ఐటీ శాఖ, ఈడీలు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. దేశ పర్యటన ముగించుకున్న తర్వాత సమైక్య ముసుగులో జగన్ ప్రపంచ పర్యటనకు సిద్ధమవుతారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు కూడా తెలియని ఆర్టికల్ 3 గురించి కేంద్రానికి తెలిపింది జగనేనని దుయ్యబట్టారు.