: మమ్మల్ని రక్షించండి బాబోయ్.. అంటున్న మగమహారాజులు


హక్కుల సాధనలో భాగంగా సాధించుకున్న మహిళా చట్టాలు ఇప్పుడు మగమహారాజుల పాలిట శాపాలుగా తయారయ్యాయని వాపోతున్నారు చాలామంది పురుష పుంగవులు. నిన్న జరిగిన పురుషుల రోజు సందర్భంగా చెన్నైలో ఓ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, 'మా భార్యలు మమ్మల్ని హింసిస్తున్నారు బాబోయ్... రక్షించండం'టూ 5000 ఫిర్యాదులు అందాయట.

ఇందులో 400 మంది విడాకులు కావాలని కోరుకుంటున్నారు. మరోపక్క, భర్తలు భార్యలని వేధించడం లేదా? అని మహిళలు మగాళ్లను ప్రశ్నిస్తున్నారు. ఒక్క చెన్నైలోనే ఇన్ని ఫిర్యాదులు అందాయంటే... ఇక రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఇంకెన్ని ఫిర్యాదులు వచ్చుంటాయోనని బాధపడుతున్నారు. మగవాళ్లు చేసే ఫిర్యాదుల్లో అనుమానం, మానసిక అసమతౌల్యం, వేధింపులు అధికంగా ఉన్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. వైజాగ్ లో భార్యాబాధిత సంఘం కూడా వెలసినట్టు సమాచారం.

ఈ వేధింపులకే తాళలేకపోతే.. మరి ఇన్నాళ్లూ మహిళలపై పాల్పడిన వేధింపుల పర్వం సంగతేంటని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అయినా గణాంకాలు మాత్రం మహిళలపై వేధింపులతో పోలిస్తే పురుషులపై వేధింపులు లెక్కించదగినవి కాదని అంటున్నారు. పురుషులు మాత్రం ఈ వేధింపులు ఆపేందుకు ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు '498 ఏ' చట్టాన్ని రద్దు చేయాలని కూడా కోరుతున్నారు. చూద్దాం... ఎవరి కోరిక నెరవేరుతుందో!

  • Loading...

More Telugu News