: జీవోఎం సభ్యులతో కొనసాగుతున్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీలు


విభజన విషయంలో సీమాంధ్రకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో, ఈ మధ్యాహ్నం నుంచి సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీవోఎం సభ్యులతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. కొద్దిసేపటి కిందట ఆంటోనీతో వారి భేటీ ముగియడంతో, వెంటనే వీరప్ప మొయిలీని.. కావూరి, చిరంజీవి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, కోట్ల కలిశారు. అనంతరం షిండే, ఆజాద్ ను కలిసే అవకాశం ఉంది. విభజన నివేదికపై జీవోఎం కసరత్తు రేపటితో ముగిసి వచ్చేవారం కేబినెట్ ముందుకు వెళుతుంది.

  • Loading...

More Telugu News